శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్

శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. గోవా నుండి కలకత్తా వెళ్తున్న ఇండిగో విమానానికి,  బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి, హైదరాబాద్ నుంచి పుణె ఇండిగో విమానానికి బెదిరింపు కాల్ రావడంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆదివారం ఉదయం హైడ్రామా చోటుచేసుకుంది. మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ ఫేక్ అని అధికారులు నిర్ధారించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.