ఢిల్లీ స్కూళ్లు బాంబు బెదిరింపు కాల్స్‌తో బెంబేలెత్తుతున్నాయి. మొన్న 40 స్కూళ్లకు బెదిరింపు కాల్స్ రాగా.. ఈ రోజు శుక్రవారం ( డిసెంబర్ 13)న ఆరు పాఠశాలలు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి. పశ్చిమవిహార్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్... కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంతో పాటు పలు స్కూళ్లకు ఈ మెయిల్స్ వచ్చాయి. ఈ మెయిల్ లో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు ఉన్నట్లు తెలిపారు.
దీంతో పాఠశాల యాజమాన్యాలు పిల్లలను ఇంటికి పంపించి.. వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది, బాంబు స్క్వాడ్ వారికి సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మెయిల్ ఐపీ అడ్రస్ ఎక్కడిదనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read :- హైదరాబాద్ లో ఘోరం.. భార్య గొంతు కోసి.. కొడుకు గొంతు నులిమి
ఢిల్లీలోని పాఠశాలలకు బెదిరింపులు రావడం డిసెంబర్ రెండో వారంలో ఇది రెండోసారి. డిసెంబరు 9న కూడా 40కి పైగా స్కూళ్లకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. పాఠశాల ఆవరణల్లో పేలుడు పదార్థాలను అమర్చామని, వాటిని పేల్చకుండా ఉండాలంటే 30 వేల డాలర్లు ఇవ్వాలని అగంతకులు బెదిరించారు. అయితే, అది ఫేక్ అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇకపోతే, ఈ ఏడాది ప్రారంభం నుంచే ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లోని స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇటీవలే, రోహిణి ప్రాంతంలోని ఓ సీఆర్పీఎఫ్ స్కూల్ బయట బాంబు పేలుడు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది