జబల్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఇండిగో 6ఈ 7308 విమానంలో బాంబు ఉన్నట్లు ఆదివారం ఉదయం 8గంటలకు మెయిల్స్ వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన ఇండిగో ఫ్లైట్ సర్వీస్ సంస్థ నాగ్ పూర్ లో ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. బాంబ్ థ్రెట్ మెయిల్స్ రాగానే.. విమానం సెప్టెంబర్ 1 ఉదయం 8 గంటలకు నాగ్ పూర్ ఎయిర్ పోర్ట్ కు మల్లించారు. ప్రయాణికులను కిందకు దించి.. ఐసోలేషన్ బేకు ఫ్లైట్ తరలించారు.
విమానయాన సంస్థ ప్రయాణికులకు సహాయం, బ్రేక్ ఫాస్ట్ అందించింది. అసౌకార్యానికి గురైన ప్యాసింజర్లకు క్షమాపణలు చెప్పింది. ఫ్లైట్ అంతా చెక్ చేయగా.. ఎలాంటి బాంబ్ బ్లాస్ట్ కనిపించలేదు. ఇటీవలి కాలంలో విమానాశ్రయాలు, ఆసుపత్రులకు, స్కూల్స్ కు ఫేక్ బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. జూన్ 18న జైపూర్, చెన్నై, వారణాసి సహా 41 విమానాశ్రయాలకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ఆగస్ట్ 22న కూడా ఎయిర్ ఇండియా విమానానికి ఇలాగే జరగింది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) అటువంటి చర్యలకు పాల్పడిన వారిపై ఐదేళ్ల నిషేధాన్ని ప్రతిపాదించింది.
Also Read :- 80 రైళ్ల రద్దు.. ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే బిగ్ అలర్ట్