
హైదరాబాద్ నగరంలో బాంబు బెదిరింపులు.సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న అశోక హోటల్కు బాంబు పెట్టినట్లు ఓఅగంతకుడు చేసిన కాల్ కలకలం రేపింది. వెంటనే మెయిన్ కంట్రోల్ నుంచి గోపాలపురం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో హోటల్ మొత్తం తనిఖీలు చేపట్టారు.
హోటల్లో ఉన్న కస్టమర్ల అందరిని బయటకు పంపి క్షుణ్ణంగా తనిఖీ చేసి చివరికి బాంబు లేదని పోలీసులు తేల్చారు. గంట పాటు హోటల్ పోలీసులు తనిఖీ చేశారు. ఫేక్ కాల్ గా తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.