
లక్నో: ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం అయోధ్య రామాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు రామాలయాన్ని పేల్చేస్తామని కలెక్టరేట్‌కు ఈమెయిల్ పంపించారు. సమాచారం అందిన వెంటనే భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి. ఆలయం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశాయి. అయోధ్య మాత్రమే కాకుండా బారాబంకి, ఇతర సమీప జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించాయి.
అధికారులు కూడా పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీలను పరిశీలించారు. దీంతో అయోధ్య సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఘటనపై కేసును నమోదు చేశారు. ఈ బెదిరింపు మెయిల్ తమిళనాడు నుంచి ఇంగ్లీష్ లో వచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఈమెయిల్ కు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.