విమానంలో కొట్టుకున్న ప్యాసింజర్లు.. బాంబుతో పేల్చేస్తామంటూ బెదిరింపులు

విమానంలో కొట్టుకున్న ప్యాసింజర్లు.. బాంబుతో పేల్చేస్తామంటూ బెదిరింపులు

ఇండిగో విమానంలో ఇద్దరు ప్యాసింజర్లు కొట్టుకున్నారు. సీటు విషయంలో వచ్చిన గొడవ ముదిరి ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు..అంతేకాదు.. నా దగ్గర బాంబు ఉంది.. పేల్చేస్తాను.. జాగ్రత్త అంటూ ఒకరినొకరు బెదిరించుకున్నారు.

విమానం లో గాల్లో ఉండగానే ఇదంతా జరగడంతో తోటి ప్రయాణికులు భయంతో వణికిపోయారు. చివరి విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత సెక్యూరిటీ అధికారులు చెకింగ్ చేసి బాంబు లేదు ఏదీ లేదు అని నిర్ధారణ కావడంతో ప్యాసింటర్లు ఊపిరి పీల్చుకున్నారు. 

శనివారం ( జనవరి 25) అర్థరాత్రి కొచ్చి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో ఈ వింత ఘటన జరిగింది. 171 మంది ప్రయాణికులతో చెన్నై వెళ్తున్న విమానంలో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఇద్దరు ప్రయాణికుల మధ్య వాగ్వాదం జరిగింది. 

అమెరికన్, కేరళకు చెందిన మరోవ్యక్తి సీటు విషయంలో గొడవపడ్డారు.. ఇద్దరి మధ్య గొడవ పెరిగి కొట్టుకున్నారు. అంతటితో ఆగ కుండా నా దగ్గర బాంబు అంటే..నా దగ్గర బాంబు ఉంది అంటూ పేల్చేస్తామని బెదిరించుకున్నారు..దీంతో తోటి ప్రయాణి కులు భయంతో వణికిపోయారు. 

చివరగా ఆదివారం తెల్లవారు జామున చెన్నై విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్ పోర్టు సెక్యూరిటీ అధికారులు విమానం మొత్తం చెక్ చేసి బాంబు లేదని చెప్పారు. ఇక ఘటనకు కారణమమైన ఇద్దరు ప్యాసింజర్లు తదుపరి విచారణ కోసం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.