ప్యారిస్: ఫ్రాన్స్ లోని ప్యారిస్ ఈఫిల్ టవర్ దగ్గర బాంబు ఉన్నట్లు ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు వెంటనే ఈఫిల్ టవర్ కు చేరుకొని అక్కడున్న విజిటర్స్ అందరినీ ఖాళీ చేయించారు. ఆ ప్రాంతం మొత్తాన్ని అధీనంలోకి తీసుకొని జల్లెడ పట్టారు. బాంబు జాడ తెలియకపోవటంతో ఫోన్ చేసిన వ్యక్తి ఉత్తుత్తి బెదిరింపుకు పాల్పడినట్లు తేల్చారు. ఫోన్ చేసిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. అయితే ఈఫిల్ టవర్ దగ్గరున్న కొంతమంది విజిటర్స్ మాత్రం ఓ వ్యక్తి అల్లా హు అక్బర్ అంటూ అరుస్తూ ఈఫిల్ టవర్ పేల్చేస్తానంటూ బెదిరించటంతో అందరినీ ఖాళీ చేయించారని చెబుతున్నారు.
For More News..