వండర్ లాకు బాంబు బెదిరింపులు.. ఆదిబట్ల పీఎస్​లో ఫిర్యాదు..

ఇబ్రహీంపట్నం: ప్రతిరోజూ వేల సంఖ్యలో పర్యాటకులు వచ్చిపోయే హైదరాబాద్ వండర్ లా అమ్యూజ్ మెంట్ పార్కుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం రావిర్యాలలో ఉన్న హైదరాబాద్ వండర్ లా అమ్యూజ్ మెంట్ పార్క్ లో బాంబు పేలుడు సంభవించే అవకాశం ఉందని ఈ నెల12న ఉదయం 7.42 కు ఒక ఈమెయిల్ వచ్చింది.

ఇందుకు సంబంధించి​ పూర్తి వివరాలను జత చేస్తూ అదేరోజు ఆదిబట్ల పీఎస్​లో ఆ సంస్థ అసిస్టెంట్ మేనేజర్‌‌‌‌ రాంబాబు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వండర్​లాను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి బాంబు దొరకకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ గుర్తుతెలియని వ్యక్తులు పంపిన ఈ మెయిల్​ విషయంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్నది.