ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు మళ్లీ బాంబు బెదిరింపులు

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు మళ్లీ బాంబు బెదిరింపులు

నాచారం, వెలుగు: నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్​కు మరోసారి బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. స్కూల్​లో బాంబు పెట్టినట్లు ఉదయం 9 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పంపించాడు. దీంతో స్కూల్ యాజమాన్యం డయల్100కు సమాచారం ఇవ్వడంతో బాంబు స్క్వాడ్​స్కూల్ మొత్తం తనిఖీ చేసింది. 

ఆందోళనకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన స్కూల్ కు చేరుకొని పిల్లలను తీసుకువెళ్లారు. సాయంత్రం వరకు బాంబు స్క్వాడ్ తనిఖీలు కొనసాగగా, ఏమీ దొరకకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గత డిసెంబర్ 20న కూడా పాఠశాలకు మెయిల్ రావడంతో ఇలాగే తనిఖీ చేశారు. కేవలం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మాత్రమే బెదిరింపు కాల్స్, బెదిరింపు మెయిల్ వస్తుండడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.