
ఫేక్ సర్టిఫికేట్ తో ఎంబీబీఎస్ చదివిన ఓ విద్యార్థి కేసులో బాంభై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇండియాలో జనాభాకు సరిపడ వైద్యులు లేరని.. తప్పు జరిగిపోయినా ఆ MBBS సర్టిఫికేట్ రద్దు చేయడం కుదరదని ముంభై హైకోర్టు నిర్ణయాత్మక తీర్పు చెప్పింది. మహారాష్ట్ర సియోన్ లోని లోకమాన్య తిలక్ మెడికల్ కాలేజీలో లుబ్నా ముజావర్ అనే విద్యార్థి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ చూపించి అడ్మిషన్ పొందాడు. ఆయన తండ్రి, తల్లకి తలాక్ చెప్పినందున ఇంకమ్ సర్టిఫికేట్ లో రూ.4.5లక్షల కంటే తక్కువ ఆదాయాన్ని ఉన్నట్లు చూపించాడు. వాస్తవానికి అతని తల్లి మునిసిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగి. ఆ విషయాన్ని అప్లికేషన్ లో దాచిపెట్టాడు.
2012లో టాప్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ వచ్చింది. తర్వాత 2017లో తన MBBS డిగ్రీ కూడా పూర్తైంది. మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బోర్డు 2012లో నాన్ క్రిమిలేయర్ స్టరిఫికేట్ ఆదారంగా OBC లకు వచ్చిన MBBS అడ్మిషన్లపై ముంభై హైకోర్టు విచారణ జరిపింది. ఆ కేసు విచారణలో ముంభై హైకోర్టు 3 నెలల్లోగా కోర్సు కోసం ఓపెన్ కెటగిరి చెల్లించాల్సిన ఫీజుతోపాటు రూ.50వేలు చెల్లించాలని విద్యార్థిని కోర్టు ఆదేశించింది. MBBS సర్టిఫికేట్ రద్ధు చేయాలన్న వాదనలను కోర్టు తోసిపుచ్చింది. భారత్ లో ఇప్పటికే వైద్యుల కొరత ఉందని.. కేవలం ఫేక్ సర్టిఫికేట్ తో తెచ్చుకున్న అడ్మిషన్ కారణంగా సర్టిఫికేట్ ను క్యాన్సల్ చేయలేమని తీర్పు చెప్పింది.