రాహుల్పై ప్రధాని మోదీ ఆరోపణపై..విచారణ పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేత

రాహుల్పై ప్రధాని మోదీ ఆరోపణపై..విచారణ పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేత

న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై విచారణ పిటిషన్ ను ముంబై హైకోర్టు కొట్టివేసింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఆరోప ణలపై దర్యాప్తునకు సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలతో దర్యాప్తునకు ఆదేశించాలని ఇన్స్పిరేషనల్ గ్రూప్ వెల్ఫేర్ అసోసియేషన్ వేసిన పిటిషన్ ను 2024, సెప్టెంబర్ 13న విచారించిన ముంబై హైకోర్టు కొట్టివేసింది. 

ఎన్నికల సమయంలో ప్రధాని తన ప్రసంగంలో టెంపోలో రాజకీయ పార్టీకి కొంతమంది పారిశ్రామిక వేత్తలు డబ్బు పంచుతున్నట్లు ఆరోపించారు.  దీనికి  ప్రధాని పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని, సీబీఐ, ఈడీ ద్వారా త్వరగా విచారణ ప్రారంభించాలని రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. 

ALSO READ : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు : సీఎం కేజ్రీవాల్ కు బెయిల్

మోదీ ఆరోపణలపై సీబీఐ, ఈడీ, ఐటీతో విచారణ జరపించాలని పిటిషనర్ కోర్టును కోరారు. ప్రధాని పేర్కొన్న వ్యక్తులపై విదేశా మారక ద్రవ్య నిర్వహణచట్టం, అవినీతి నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. శుక్రవారం విచారణ చేప్టటిన ముంబై హైకోర్టు పిటిషన్ ను కొట్టివేసింది.