ఈ నెల 8 వరకు వరవరరావుకు బెయిల్‌ పొడిగింపు

ఈ నెల 8 వరకు వరవరరావుకు బెయిల్‌ పొడిగింపు

ఎల్గార్‌ పరిషద్‌-మావోయిస్టుల లింకు కేసులో నిందితులుగా ఉన్న కవి వరవరరావు బెయిల్‌ను ఈ నెల 8 వరకు ముంబై  హైకోర్టు మంగళవారం పొడిగించింది. ఆయన ఆరోగ్య కారణాల కారణంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా నవీ ముంబైలోని తలోజా జైలులో పరిస్థితులు మెరుగుపడ్డాయా లేదాని ప్రశ్నించింది. ఒకవేళ పరిస్థితులు మెరుగుపడకపోతే.. వరవరరావును తిరిగి అక్కడకు పంపితే... మరింత అనారోగ్యం బారిన పడవచ్చునని జస్టిస్‌ ఎస్‌ బి షుక్రే, జి సనప్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ తెలిపింది. గతేడాది ఫిబ్రవరిలో ఆరోగ్య కారణాల రీత్యా వరవరరావుకు ఆరునెలల పాటు తాత్కాలిక బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది.  తన బెయిల్‌ను పొడిగించాలని, తన అనారోగ్యం దృష్ట్యా శాశ్వత బెయిల్‌ను ఇవ్వాలని కోరుతూ వరవరరావు పిటిషన్లు దాఖలు చేశారు. సెప్టెంబర్‌ నుండి కోర్టు ఆయన బెయిల్‌ పొడిగిస్తూ వస్తోంది.  దీనిపై తదుపరి విచారణ మార్చి 8న చేపట్టనుంది.

మరిన్ని వార్తల కోసం..

 

97శాతం మార్కులొచ్చినా మెడికల్ సీటు రాలే