కునాల్ కామ్రా పిటిషన్పై..ముంబై పోలీసులు, శివసేన ఎమ్మెల్యేకు..బాంబే హైకోర్టు నోటీసులు

కునాల్ కామ్రా పిటిషన్పై..ముంబై పోలీసులు, శివసేన ఎమ్మెల్యేకు..బాంబే హైకోర్టు నోటీసులు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో స్టాండ్ అప్ కమెడియన్ కునాల్ కమ్రా దాఖలు చేసిన పిటిషన్ ను మంగళవారం( ఏప్రిల్8) బాంబే హైకోర్టు విచారించింది.ఈ  కేసును కొట్టివేయాలని కునాల్ దాఖలు చేసిన పిటిషన్పై స్పందించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రప్రభుత్వానికి, ఫిర్యాదు దారుడు అయిన శివసేన ఎమ్మెల్యే ముర్జి పటేల్ కు అధికారిక నోటీసులు జారీ చేసింది. 

న్యాయమూర్తులు సారంగ్ కొత్వాల్, ఎస్ ఎం మోదక్ లతో కూడిన డివిజన్ బెంజ్ ఈ కేసును ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. కునాల్ కమ్రాకు ఇప్పటికే ఏప్రిల్ 17 వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.  అయితే గడువు ముగిసేలోపే ఈ కేసును చేపట్టాలని పేర్కొంది.

ఫిబ్రవరి 2, 2025న, తన నయా భారత్ షో కోసం ప్రదర్శన ఇచ్చిన కమ్రా మార్చి 23న ఆ షో రికార్డింగ్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. అదే రోజు రాత్రి10.45 గంటలకు  పటేల్ ఖార్ పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. రాజకీయ పార్టీలను మధ్య రెచ్చగొట్టారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. ఫలితంగా వారి మధ్య ద్వేషం వ్యాప్తి చెందడమే కాకుండా డీప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను కించపరిచే ప్రయత్నం కూడా జరిగిందని ఫిర్యాదులో తెలిపారు. 

Also Read : అమెరికాలో రెండు నెలలకే తిరగబడ్డ జనం

దేశంలోని వివిధ సామాజిక, రాజకీయ ఘటనలపై తాను చేసిన వ్యంగ్య పు ప్రసంగాలను తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ కామ్రా ఏప్రిల్ 5న బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ను దురుద్దేశంతో కూడిన చర్య గా తెలిపాడు.శివసేన ఎమ్మెల్యే అత్యుత్సాహంతో కేవలం 70  నిమిషాల వ్యవధిలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారన్నారు. ప్రాథమిక విచారణ విధానాన్ని పూర్తిగా విస్మరించారని కామ్రా పిటిషన్‌లో పేర్కొన్నారు.