Chahal, Dhanashree Divorce: చాహల్-ధనశ్రీ వర్మ విడాకులపై రేపు నిర్ణయం.. భరణం ఎంతంటే..?

Chahal, Dhanashree Divorce: చాహల్-ధనశ్రీ వర్మ విడాకులపై రేపు నిర్ణయం.. భరణం ఎంతంటే..?

టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అతని భార్య ధనశ్రీ వర్మ విడిపోతున్నారు. వారి విడాకులపై రేపు నిర్ణయం తీసుకోవాలని బాంబే హైకోర్టు బుధవారం (మార్చి 19) ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. గురువారం (మార్చి 20) నాటికి వారి విడాకుల పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ మాధవ్ జామ్దార్ ఫ్యామిలీ కోర్టును కోరారు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13బి కింద విడాకుల డిక్రీకి అవసరమైన ఆరు నెలల కూలింగ్ పీరియడ్‌ను రద్దు చేయాలని కోర్టు కోరింది. చాహల్ మరో మూడు రోజుల్లో ఐపీఎల్ ఆడనుండడంతో రేపటి లోగా తీర్పు ఇవ్వాలని బాంబే హైకోర్టు తెలిపింది.

ధనశ్రీ వర్మకి చాహల్ రూ. 4.75 కోట్లు చెల్లించడానికి అంగీకరించాడు. విచారణ సమయంలో రూ. 2.37 కోట్లు మాత్రమే చెల్లించినట్టు సమాచారం. జస్టిస్ మాధవ్ జామ్దార్ విడాకుల తర్వాత మిగిలిన భరణాన్ని చెల్లించవచ్చని తీర్పు ఇచ్చారు. గతంలో ధనశ్రీ వర్మ రూ. 60 కోట్లు భరణం అడిగినట్లు వార్తలు వచ్చినా అందులో నిజం లేదని తెలుస్తుంది. 2025 ఫిబ్రవరి నెలలో ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం చాహల్ ఐపీఎల్ తో బిజీ కానున్నాడు. అతను 2025 ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. మెగా ఆక్షన్ లో రూ. 18 కోట్ల రూపాయలకు పంజాబ్ అతన్ని కొనుగోలు చేసింది. 

చాహల్ ప్రస్తుతం భారత జట్టులో స్థానం కోసం పోరాడుతున్నాడు. అయితే ఈ లెగ్ స్పిన్నర్ కు భారత జట్టులో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. టీ20 వరల్డ్ కప్ 2024 స్క్వాడ్ లో స్థానం దక్కినా అతనికి ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత సెలక్టర్లు చాహల్ పూర్తిగా పక్కన పెట్టేశారు. భవిష్యత్ లోనూ చాహల్ భారత జట్టులోకి రావడం కష్టంగానే కనిపిస్తుంది. అతని వయసు 34 ఏళ్ళు కావడం దీనికి ప్రధాన కారణం. 34 ఏళ్ల చాహల్ ఇప్పటివరకు భారత్ తరఫున 72 వన్డేలు, 80 టీ20లు ఆడాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 217 వికెట్లు పడగొట్టాడు.

ALSO READ | Mohammad Rizwan: రిజ్వాన్‌కు జీతం దండగ.. పాక్ క్రికెట్ బోర్డును అవమానించాడు: మాజీ పేసర్