వైసీపీ నేతల ఇండ్లల్లో నాటు బాంబులు గుర్తింపు

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. ఎన్నికలు జరుగుతున్న క్రమంలో  వైసీపీ, టీడీపీ నేతల మధ్య గొడవలు చెలరేగాయి. పల్నాడు జిల్లాలో ఇంకా 144 సెక్షన్ కొనసాగుతుంది. ఎన్నికలప్పుడు జరిగిన గొడవలకు విచారణకోసం పల్నాడు జిల్లామాచవరం మండలంలోని పిన్నెల్లిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇరు పార్టీల నేతలను అదుపులోకి తీసుకునే క్రమంలో ఇండ్లపై రైడ్స్ చేశారు.

వైసీపీ నేతల ఇండ్లల్లో పెట్రోల్ బాంబులు, నాటు బాంబులును చూసి షాక్కు గురయ్యారు. భారీ సంఖ్యలో నాటు బాంబులను గుర్తించి సీజ్ చేశారు. వైసీపీ నేతలను అరెస్టు చేశారు. ఎన్నికల పోలింగ్ రోజు నాటు బాంబులు ఉపయోగించి ఉంటే రాష్ట్రమంతా అల్లర్లు చెలరేగేవని భావిస్తున్నారు రాజకీయ పండితులు.