ఖమ్మం టౌన్, వెలుగు : సిటీలోని బొమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పాలిటెక్నిక్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ రిజల్ట్స్ లో ఎ. నవ్య 10/10జీపీఏ సాధించినట్లు ఆ కాలేజ్ చైర్మన్ బొమ్మ రాజేశ్వరరావు తెలిపారు. మరో 12 మంది స్టూడెంట్స్ స్టేట్ లెవెల్ ఎస్ జీపీఏ ర్యాంకులు సాధించి జిల్లాలో టాపర్స్ గా నిలిచినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్టూడెంట్స్ ను బుధవారం రాజేశ్వరరావు తో పాటుగా వైస్ చైర్మన్ బొమ్మ సత్య ప్రసాద్, సెక్రటరీ ఉదారు శ్రీధర్, డైరెక్టర్ ఉదారు మాధవి, కాలేజ్ ప్రిన్సిపాల్ బీఎం. రంజిత్ అభినందించారు.