- దేవుళ్ల పేరుతో రాజకీయ పబ్బం
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలనాల కోసమే కామెంట్స్చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. దేవుళ్ల పేరుతో ఇంకా ఎన్నాళ్లు రాజకీయ పబ్బం గడుపుతారని ప్రశ్నించారు. మోసాలతో పాలిటిక్స్ చేసిన బీఆర్ఎస్ఇక ఖాళీయేనన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో స్టేట్‌లో 15 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
గురువారం ఆయన డీసీసీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. రాజకీయ జీవితంలో ఉన్నవాళ్లు హుందాగా ఉండాలని, ఎంపీ అర్వింద్ తన చిల్లర మాటలను మానుకోవాలని హితవు పలికారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అర్వింద్ దేవుళ్ల పేరుతో రాజకీయం చేయాలని చూసినా, కోరుట్ల ప్రజలు తిప్పికొట్టారని, బీఆర్ఎస్కల్లబొల్లి మాటలను సైతం రాష్ట్ర ప్రజలు నమ్మలేదన్నారు. కుల, మతాలు ఆచార వ్యవహారాలు పూర్తిగా వ్యక్తిగతమని, వాటిని చూపి ఓట్లడగడం బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మతాలను రెచ్చగొట్టి లాభం పొందాలని భావిస్తున్న ఎంపీ అర్వింద్‌ను నిజామాబాద్ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఎవరికి ఎప్పుడు ఎలా వాతపెట్టాలో జిల్లా ప్రజలకు బాగా తెలుసని, ఇంకా మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసినా లాభం లేదన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు బాండ్ రాసిచ్చి, మంజూరును ఇంకా కాగితాల్లోనే పెట్టారన్నారు. ఓట్ల కోసమే సరిగ్గా ఎలక్షన్టైమ్లో కేంద్రీయ పాఠశాల బిల్డింగ్ఓపెనింగ్చేశారన్నారు. పాలిటిక్స్‌లో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ, మచ్చలేని మనిషిగా గుర్తింపు పొందిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని విమర్శించడం తగదన్నారు.
నిజామాబాద్‌కు స్మార్ట్ సిటీ హోదా ఎక్కడా?
హైదరాబాద్, వరంగల్ తర్వాత రాష్ట్రంలో అతిపెద్దదైన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఎంపీ అర్వింద్ నిర్లక్ష్యం చేశారని మహేశ్విమర్శించారు. కరీంనగర్ మున్సిపాలిటీ స్మార్ట్ సిటీ హోదా ఎగరేసుకుపోయినా సోయిలేకుండా ఉన్నారన్నారు. కరీంనగర్ హోదాను తాము వ్యతిరేకించడం లేదని, ఎంపీ అర్వింద్ చేతగాని తనాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నామన్నారు. డీసీసీ ప్రెసిడెంట్మానాల మోహన్‌రెడ్డి, తాహెర్, గడుగు గంగాధర్, కేశవేణు పాల్గొన్నారు.