
హుస్నాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని, ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కొట్లాడుతామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మ శ్రీరామ్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలేదని నిరసిస్తూ ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆ పార్టీ కార్యకర్తలు దీక్ష చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ మహిళలకు రూ.2500, రూ.4 వేల పెన్షన్, రూ.15 వేల రైతు బంధు, రూ.2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, రూ.5 లక్షల నగదు సాయం ఏమయ్యాయని ప్రశ్నించారు.
ఈ నిరసనలో ఆ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంగోపాల్‌రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ లక్ష్మారెడ్డి, కో కన్వీనర్ వేణు గోపాల్‌రావు, హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, హుస్నాబాద్, అక్కన్నపేట, చిగురుమామిడి మండలాల అధ్యక్షులు రాజేంద్రప్రసాద్, మహేందర్‌రెడ్డి, శ్రీనివాస్, హుస్నాబాద్ పట్టణ మాజీ అధ్యక్షుడు శంకర్ బాబు, విద్యాసాగర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దినేశ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సతీశ్ పాల్గొన్నారు.