కాంగ్రెస్‌‌లో చేరిన బొమ్మకల్​సర్పంచ్​

కరీంనగర్​ రూరల్​, వెలుగు: కరీంనగర్​రూరల్​మండలం బొమ్మకల్​సర్పంచ్, బీఆర్‌‌‌‌ఎస్​లీడర్​పురుమల్ల శ్రీనివాస్​శనివారం కాంగ్రెస్‌‌లో చేరారు. ఇటీవల ఆయన అధికార పార్టీకి రాజీనామా చేశాడు.

ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్​రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ చేరగా కండువా కప్పి శ్రీనివాస్‌‌ను పార్టీలోకి ఆహ్వానించారు. కరీంనగర్​ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ నుంచి పోటీ చేసేందుకు ఇటీవల అప్లై చేసుకున్నాడు.