అధికార పార్టీకి బొమ్మకల్​ సర్పంచ్​ రాజీనామా

కరీంనగర్​ రూరల్, వెలుగు: పార్టీలో తనకు గుర్తింపు లేనందున రాజీనామా చేస్తున్నట్లు కరీంనగర్​ రూరల్​ మండలం బొమ్మకల్​ సర్పంచ్ ​పురమల్ల శ్రీనివాస్​ తెలిపాడు. ఆదివారం ఈ మేరకు   జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుకు లేఖ అందజేశాడు.

గతంలో ప్రత్యర్థులు నాపై రాజకీయంగా కుట్రలు చేసి వేధించినా, అసత్య ప్రచారం చేసినా తనకు పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్​లభించలేదన్నాడు. శ్రీనివాస్​ భార్య జడ్పీటీసీగా ఉన్నారు. కాగా పురమల్ల శ్రీనివాస్​  కాంగ్రెస్​ నుంచి కరీంనగర్​ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.