
యాదాద్రి భువనగిరి : హాజీపూర్‌లో జరిగిన వరుస ఘటనల్లో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసులు అదుపులో ఉన్న వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి అన్ని విషయాలు తెలిపాడన్నారు సీపీ మహేష్ భగవత్. కల్పన, శ్రావణి, మనీషాను తానే హత్య చేసినట్టు అంగీకరించాడని.. 2015లో 11ఏళ్ల కల్పనపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు శ్రీనివాస్‌రెడ్డి పోలీసులకు చెప్పాడన్నారు. నెలన్నర క్రితం డిగ్రీ విద్యార్థిని మనీషాను హత్యాచారం చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈనెల 25న స్కూల్‌కు వెళ్లి వస్తున్న శ్రావణిని కూడా అత్యాచారం చేసి.. ఆ తర్వాత హత్య చేసినట్లు శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించాడు. ముగ్గురిని పాడుపడిన బావిలో పాతిపెట్టినట్టు తెలిపాడు.
శ్రీనివాస్‌రెడ్డి కిరాతకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కర్నూలులో మహిళపై అత్యాచారం, హత్య చేశాడు. అలాగే వరంగల్‌లో ఓ మహిళపై అత్యాచారయత్నం చేశాడు. బెంగళూర్ లోని ఓ ఏటీఎంలో బ్యాగ్ లాక్కుంటూ మహిళపై కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ మహిళపై దాడి చూసింది శ్రీనివాస్ రెడ్డేని పోలీసుల విచారణలో తేలింది.