బొమ్మరిల్లు రీరిలీజ్ కి సిద్ధం. ఎప్పుడంటే..?

బొమ్మరిల్లు రీరిలీజ్ కి సిద్ధం. ఎప్పుడంటే..?

కొన్ని  ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాలు ఎన్నిసార్లు చూసిన అస్సలు బోర్ కొట్టదు. అయితే తెలుగులో ప్రముఖ దర్శకుడు భాస్కర్ దర్శకత్వం వహించిన బొమ్మరిల్లు చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయిన సంగతి అందరికీ తెల్సిందే. ఈ చిత్రంలో హీరోగా  ప్రముఖ హీరో సిద్దార్థ్ నటించగా బ్యూటీఫుల్ హీరోయిన్ జెనీలియా హీరోయిన్ గా నటించింది. 

లవ్ మరియు ఫ్యామిలీ ఓరియెంటెడ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ఒక ఊపు ఊపిందనై చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ చిత్రంలోని సాంగ్స్ ఇప్పటికీ చాలామంది తమ ఫెవెరెట్ లిస్ట్ లిస్ట్ లో ఉంటాయి. ఇక జెనీలియా వీలైతే నాలు మాటలు కుదిరితే కప్పు కాఫీ అంటూ చెప్పే క్యూట్ డైలాగులు ఆడియన్స్ ని కట్టిపడేశాయి. 

Also Read :- ఆ హీరోని ఇకనుంచి అలా పిలుస్తానంటున్న విజయ్ దేవరకొండ

అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో పాత చిత్రాల రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతుండటంతో బొమ్మరిల్లు చిత్రాన్ని కూడా మళ్ళీ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 21వ తారీఖున 4కే వెర్షన్ తో బొమ్మరిల్లు చిత్రం  థియేటర్లలో  మళ్ళీ ఆడియన్స్ ని అలరించబోతోంది.