సీఎం కేసీఆర్​ ద్రోహం చేశారు.. టికెట్టు దక్కకపోవడంపై బొమ్మెర రామ్మూర్తి సెల్ఫీ వీడియో

ఉద్యమకారుడైన తనకు బీఆర్​ఎస్​ నుంచి ఎమ్మెల్యే టికెట్టు ఇవ్వకుండా సీఎం కేసీఆర్​ మోసం చేశారని ఆ పార్టీ సీనియర్​ నేత బొమ్మెర రామ్మూర్తి ఆరోపించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ బీఆర్​ఎస్​పార్టీ మాజీ ఇంఛార్జీగా ఉన్న ఆయన టికెట్టు దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో రిలీజ్​ చేశారు. ఆయన మాట్లాడుతూ..  సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్​రావులు మాదిగలకు అన్యాయం చేశారని ఆరోపించారు. 

ఉరి వేసే ముందైన చివరి కోరిక ఏంటని అడుగుతారు కానీ కేసీఆర్​తనను టికెట్టు విషయంలో కనీసం చర్చించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పెద్దలకు మనసు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమం నుంచి కేసీఆర్​ వెన్నంటే ఉన్న తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  మధిర నియోజకవర్గ టిక్కెట్టు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. లేదంటే పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తానని హెచ్చరించారు.