- ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తికావస్తున్నాయి
- హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 7 నుంచి మొదలుకానున్న ఆషాఢ బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. 7వ తేదీన లంగర్హౌస్నుంచి మొదలయ్యే తొట్టెల ఊరేగింపును మంత్రులు ప్రారంభిస్తారని చెప్పారు. తర్వాత గోల్కొండ కోటలోని ఆలయనాకి తరలి వెళ్తాయన్నారు. కోటలోని ఆలయానికి రంగులు, అలంకరణ పనులు పూర్తయ్యాయని, బారికేడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. బోనాలు ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిటీలోని ఆలయాలకు కేటాయించిన నగదు చెక్కులను రెడీ చేశామని, బుధ లేదా గురువారాల్లో పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఆలయాల వద్ద భద్రత, పార్కింగ్, విద్యుత్ సరఫరా, బారికేడ్ల, తాగునీరు, తాత్కాలిక టాయిలెట్ల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ మేరకు మంగళవారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన రివ్యూలో కలెక్టర్వెల్లడించారు.
దోమల నివారణకు చర్యలు తీస్కోవాలి
సీజనల్వ్యాధులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో కలెక్టర్సమావేశమయ్యారు.అన్ని వైద్య ఆరోగ్య కేంద్రాలలో డెంగీ టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. గడిచిన ఐదేండ్లలో ఏ ఏ ప్రాంతాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యాయో వార్డ్, సర్కిల్, యూపీహెచ్సీ వారీగా డేటా తీసుకుని, నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సంక్షేమ హాస్టళ్లపై స్పెషల్ఫోకస్పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట్, జీహెచ్ఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంఓహెచ్) రాంబాబు, చీఫ్ ఎంటమాలాజిస్ట్, డిస్ట్రిక్ట్ సర్వేలెన్సు ఆఫీసర్ డాక్టర్ హర్ష, ఇన్చార్జ్ డీఎంఓ నిరంజన్ పాల్గొన్నారు.