డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీలో బోనాల సంబరాలు

హైదరాబాద్: బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కాలేజీలో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా   బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, కాలేజీ కరస్పాండెంట్ సరోజ వివేక్, బాహుబలి ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ  హాజరయ్యారు. అనంతరం వారు బోనాల వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి చిహ్నమని అన్నారు.  గ్రామ దేవతలను పూజించేందుకు బోనాల పండుగను నిర్వహిస్తారని తెలిపారు. 

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

బోనాల సంబరాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.  బోనాలు నెత్తిన పెట్టుకొని పెద్ద ఎత్తున విద్యార్థులు వచ్చారు.  డప్పు చప్పుళ్ల నడుమ పోతరాజుల విన్యాసాలు అలరించాయి. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకర్షించాయి. ముఖ్యంగా గండిపేట మైసమ్మ... కట్టమీద మారమ్మ,  డిల్లెం కళ్లెం పాటలకు విద్యార్థులు వేసిన డ్యాన్స్ లు ఆహూతులను కట్టిపడేశాయి.