సల్లంగ సూడమ్మ పోచమ్మ తల్లి

లక్ష్మణచాంద, వెలుగు: లక్ష్మణచాంద మండలం పీచరలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. కొత్తగా నిర్మించిన పోచమ్మ తల్లి ఆలయంలో ఇటీవల విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం పెద్ద ఎత్తున మహిళలు బోనాలతో ప్రధాన వీధులగుండా ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని పోచమ్మ తల్లికి సమర్పించారు.