ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని నిజామాబాద్నగరంలో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండగ నిర్వహించారు. పాత కలెక్టరేట్ ఆవరణలో ఉన్న నవదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
పోతురాజులు, శివసత్తుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జేఏసీ జిల్లా చైర్మన్ అలుక కిషన్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
– వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్