ఆస్ట్రేలియాలోని ఆషాడ మాస బోనాల జాతర ఘనంగా జరిగింది. తెలంగాణ ప్రజలంతా ఒక్కచోటికి చేర్చి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మెల్‌బోర్న్ నగరంలో రాక్‌బ్యాంక్ దుర్గామాత ఆలయంలో ఘనంగా బోనాల జాతర జరిగింది. గత 10 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో బోనాలను నిర్వహిస్తున్న మెల్‌బోర్న్ బోనాలు సంస్థ ఈసారి కూడా బోనాల పండుగను అట్టహాసంగా నిర్వహించింది.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో రాక్‌బ్యాంక్ దుర్గామాత ఆలయంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో బోనాలను నిర్వహిస్తున్న మెల్‌బోర్న్ బోనాలు సంస్థ ఈసారి కూడా బోనాల పండుగను అట్టహాసంగా నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు, తొట్టెలు సమర్పించారు. తమ మొక్కులను చెల్లించుకున్నారు.
పోతురాజుల ఆటలు, యువకుల పాటలు నృత్యాలతో బోనాల జాతర కన్నుల పండవగా సాగింది. బోనాల పాటలకు తెలంగాణ యువకులతో పాటు భారత్‌లోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా డ్యాన్సులు చేయడం విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మెల్‌బోర్న్ బోనాలు సంస్థ నిర్వాహకులు తెలంగాణ మధు, రాజు వేముల, దీపక్ గద్దె, ప్రజీత్ రెడ్డి కోతిలను వివిధ సంఘాల నాయకులు, ప్రజలు అభినందించారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బోనాలు. ఆషాడం మాసం వచ్చిందంటే చాలు రాష్ట్రంలోని ప్రతి పల్లెలో గ్రామదేవతలకు బోనాలు సమర్పించుకోవడం తెలంగాణ సాంప్రదాయం. ఇక హైదరాబాద్ లో అయితే నెల రోజులు పాటు ప్రతి ఆదివారం ఏదో ఒకచోట(సికింద్రాబాద్, లాల్ దర్వాజ) ఈ బోనాల పండగ అంగరంగవైభవంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ తెలంగాణ బోనాలు సంస్కృతి విదేశాలకు కూడా పాకింది. ఖండాంతరాలు దాటిన తెలంగాణ బోనాలు ఆస్ట్రేలియాలో మరింత వైభవంగా జరిగాయి.
ఈ సందర్భంగా తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో మెల్‌బోర్న్ నగరంలో రాక్‌బ్యాంక్ దుర్గామాత ఆలయానికి విచ్చేసిన మహిళలు భక్తి శ్రద్దలతో అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. తెలంగాణకు చెందిన వారంతా ఒకే కుటుంబ సభ్యుల మాదిరిగా కలిసి మెలిసి ఆనందంగా గడిపారు. బోనాలతో పాటు అమ్మవారికి తొట్టెలలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహకులు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నారుల ఆటా, పాటలతో యువకుల నృత్యాలతో దుర్గామాత ఆలయంలో ఎంతో సందడిగా ఈ వేడకలు జరిగాయి. ఇక ప్రత్యేకమైన బోనాల పాటలకు తెలంగాణ వారే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా మైమరిచిపోయి నృత్యాలు చేయడం ఈ వేడుకకే హైలైట్ గా నిలిచింది.