కాగజ్ నగర్, వెలుగు: మల్లికార్జున స్వామి వారికి బోనం కోసం కౌటాల మండలం శీర్ష గ్రామంలో ఒగ్గు పూజారులు జోగు పట్టారు. ప్రతీ ఏటా శ్రావణమాసం రెండో ఆదివారం ఒగ్గు పూజారులు అంతా కలిసి ఇంటింటికి వెళ్లి జోగు పట్టి ఆ బియ్యంతో మల్లికార్జున స్వామికి బోనం పోస్తారు.
మరుసటి రోజు సోమవారం ఆబియ్యంతో శివపార్వతులకు పప్పన్నం సమర్పిస్తారు. ఒగ్గు బీర్ల కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పోలె శ్రీశైలం, మండల అధ్యక్షుడు ఈరు బీరయ్య, ప్రధాన కార్యదర్శి అడే సింగరి, కళాకారులు పోలె కొమురయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.