బోనాల జాతర : భవిష్యవాణి.. పచ్చికుండ చరిత్ర ఇదే..

 బోనాల జాతర : భవిష్యవాణి.. పచ్చికుండ చరిత్ర ఇదే..

ఆషాఢమాసం బోనాల నేపథ్యంలో తెలంగాణ అంతట పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఆషాడంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని చెబుతుంటారు. అందుకే బోనాలను ఘనంగా జరుపుకుంటారు. బోనం అంటే భోజనం అని అర్ధం. కుండలో అమ్మవారికి భోజనం(నైవేద్యం) తీసుకెళ్లి అమ్మవారికి అర్పించి మరల ఇంటికి ప్రసాదంగా తెచ్చుకుంటారు. ఇలా అనాదీగా వస్తున్న ఆచారంను పాటిస్తున్నారు.  తమ  ఇంట్లోని సంప్రదాయాలను అనుసరించి బోనాలు జరుపుకుంటారు. హైదరాబాద్ లో బోనాలను ఎంతో వేడుకగా జరుపుకుంటారు.

ముఖ్యంగా.. గోల్కోండ, బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ, పాతబస్తీ సింహావాహిని, చార్మినార్ దగ్గర మొదలైన చోట్ల బోనాలను భక్తుల ఘనంగా జరుపుకుంటారు. అమ్మవారికి బోనం, తొట్లేలు, ఫలహారం బండ్లను సమర్పిస్తుంటారు. దీని వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇదిలా ఉండగా..సికింద్రాబాద్ లో ఉజ్జయినీ అమ్మవారిఆలయంలో రెండు రోజుల పాటు బోనాల పండుగను నిర్వహిస్తారు.

మొదటి రోజు భక్తులు నగరంనుంచి పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంటారు.దీనికోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి  కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంది. అన్నిశాఖలు సమన్వయంచేసుకుని భక్తులకు ఇబ్బంది కల్గించకుండా చూడాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ అమ్మవారికి పట్టు వస్త్రాలు, పొన్నం ప్రభాకర్ తొలిబోనం సమర్పించారు.  ఆదివారం ( జులై 21) ఉదయం వేకువ జామున నుంచి భక్తులు భారీగా అమ్మవారికి బోనాలు సమర్పించడానికి భారులు తీరారు. ఇదిలా ఉండగ.. ఉజ్జయినీ మహంకాళి ఆలయం దగ్గర రెండో రోజున ఫలహారం బండ్ల ఊరేగింపు, అమ్మవారిని అంబారీపైన ఊరేగించడం, రంగం కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా రంగం భవిష్యవాణిని భక్తులు ఎంతో విశ్వసిస్తుంటారు. ఉజ్జయినీ అమ్మవారు రంగం చెప్పే మహిళలో పూనుతారని చెబుతుంటారు. 

పచ్చి కుండ చరిత్ర..

సాధారణంగా కుండ ఎంతో డెలీకెట్ గా ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న వెంటనే పగిలిపోతుంది. అలాంటిటి ఉజ్జయినీ ఆలయంలో రెండో రోజు సాయత్రం పూట రంగం కార్యక్రమం నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో స్వర్ణలత అనే జోగినీ ప్రతిఏడాది కూడా రంగం చెబుతుంది. ఆమె ఒళ్లంతా పసుపు పూసుకుని, చేతిలో వేప ఆకులు, పెద్ద బొట్టు పెట్టుకుని చూస్తేనే కాస్తంతా భయంకల్గించే విధంగా ఉంటుంది. ఇదిలా ఉండగా.. స్వర్ణలత.. పచ్చికుండపై నిలబడీమరీ భవిష్యత్తు చెబుతుంది. ఆమె పచ్చికుండపై నిలబడిన కూడా ఆకుండ పగిలిపోదు. అమ్మవారు ఆమెలో ప్రవేశించడనడానికి అదే నిదర్శనమి భక్తులు చెబుతుంటారు.సోమవారం ( జులై 22)  రంగం భవిష్యవాణి కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారి ఊరేగింపుతో జాతర ముగియనుంది.