
వేములవాడ, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ అమ్మవారికి మంగళవారం (మార్చి 4) భక్తులు ఓడిబియ్యం, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
బోనాలు సమర్పించేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలిరావడంతో 2 గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. రాజరాజేశ్వర స్వామి దర్శనం తరువాత బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది.