సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ లో అల్లు అర్జున్ ని నిందించడం కరెక్ట్ కాదు: బోణీ కపూర్

సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ లో అల్లు అర్జున్ ని నిందించడం కరెక్ట్ కాదు: బోణీ కపూర్

ఇయర్ ఎండ్ సందర్భంగా టాలీవుడ్, బాలీవుడ్ దర్శకనిర్మాతల రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి బాలీవుడ్ నుంచి ప్రముఖ స్వర్గీయ నటి శ్రీదేవి భర్త, సీనియర్ ప్రొడ్యూసర్ బోణీ కపూర్ కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఇటీవలే పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఇన్సిడెంట్ గురించి స్పందించాడు.

మాములుగా సౌత్ లో హీరోలకి ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారని దీంతో తమ అభిమాన హీరోల సినిమాలు రిలీజ్ అయినా లేదా హీరోలు ఏదైనా ఈవెంట్ కి వెళ్లినా వేళా సంఖ్యలు అభిమానులు వస్తారని తెలిపాడు. దీంతో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి వచ్చిన సమయంలో కూడా ఇదే జరిగిందని కాబట్టి ఆ ఇన్సిడెంట్ కి అల్లు అర్జున్ ని నిందించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

తాను గతంలో అజిత్ హీరోగా నటించిన సినిమా చూడటానికి వెళ్లానని అదే సమయంలో అజిత్ కూడా సినిమాకి వచ్చాడని దీంతో హీరోని చూడటానికి దాదాపుగా 20వేల మందికి పైగా ఫ్యాన్స్ వచ్చారని అన్నాడు. తన లైఫ్ లో ఇంతమంది ఫ్యాన్స్ హీరోని చూడటానికి  రావడం అదే మొదటిసారి కావడంతో ఆశ్చర్యపోయానని తెలిపాడు.

ALSO READ | అల్లు అర్జున్ కేసులో మరో కీలక మలుపు.. కీలక ఆదేశాలు జారీ చేసిన NHRC

ఈ విషయం ఇలా ఉండగా డిసెంబర్ 04న పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా అల్లు అర్జున్ సినిమా చూడటానికి సంధ్య థియేటర్ కి వచ్చాడు. ఇదే సమయంలో అల్లు అర్జున్ ని చూడటానికి రేవతి అనే మహిళ తన భర్త పిల్లలతో కలసి అల్లు అర్జున్ ని చూడటానికి వచ్చింది. కానీ అనుకోకుండా జరిగిన తొక్కిసలాటలో రేవతి అక్కడిక్కడే మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీ తేజ తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.దీంతో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చెయ్యగా మధ్యంతర బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. అనంతరం పుష్ప 2 చిత్ర టీమ్ రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు ఆర్థిక సాయం అందించారు.