
చేర్యాల, వెలుగు : దళితుల దగ్గర వసూళ్లు చేసిన ప్రతి రూపాయి అధికార పార్టీ నేతలు తిరిగి ఇవ్వాలని బీజేవైఎం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బొంగొని సురేశ్‌గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మద్దూరు లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. జనగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి ఆగడాలు శ్రుతిమించాయన్నారు. ఇక్కడ ప్రజలందరూ ఆయనను ఎమ్మెల్యేగా తిరస్కరిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో తన అనుచరులను పెట్టుకొని దళిత బంధు, బీసీలకు ఆర్థికసాయం, గృహలక్ష్మి కోసం ఒక్కొక్కరి దగ్గర రూ .50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఎమ్మెల్యే వసూలు చేశారని ఆ పార్టీ కార్యకర్తలే బాహాటంగా చెబతున్నారని అన్నారు.
ఆ పైసలన్ని తిరిగి బాధితులకు ఇవ్వాలని, లేకపోతే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ప్రభుత్వం నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ 22న చేర్యాల కేంద్రంలో రాస్తారోకో నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మద్దూరు మండల ప్రధాన కార్యదర్శి ఉదయ రెడ్డి,బీజేవైఎం మండల అధ్యక్షుడు యామ శ్రీకాంత్, నాయకులు ఎం. ప్రవీణ్ గౌడ్, బాలకృష్ణ, శివ, చింతల రాజు, బొల్లు రాజు, రాజు స్వామి పరమేశ్వర్, ప్రశాంత్, చింతల చందు, భరత్, శ్రీనివాస్, సంతోష్, సిద్ధులు, గణేశ్‌యాదవ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు