మాజీ ఎంపీ వివేక్ ‌‌చేరికతో కాంగ్రెస్ ‌‌ ‌‌కు బలం : బొంతల రాజేశ్, తిప్పారపు శ్రీనివాస్

గోదావరిఖని, వెలుగు : మాజీ ఎంపీ వివేక్ ‌‌ ‌‌ వెంకటస్వామి కాంగ్రెస్ ‌‌ ‌‌లో చేరడంతో పార్టీకి మరింత బలం పెరిగిందని కాంగ్రెస్ ‌‌ ‌‌ రామగుండం కార్పొరేషన్ ‌‌ ‌‌ ఏరియా ప్రెసిడెంట్ ‌‌ ‌‌ బొంతల రాజేశ్ ‌‌ ‌‌, గోదావరిఖని టౌన్ ‌‌ ‌‌ ప్రెసిడెంట్ ‌‌ ‌‌ తిప్పారపు శ్రీనివాస్ ‌‌ ‌‌ అన్నారు. గురువారం గోదావరిఖని ప్రెస్ ‌‌ ‌‌క్లబ్ ‌‌ ‌‌లో జరిగిన మీటింగ్ ‌‌ ‌‌లో వారు మాట్లాడారు.

కాంగ్రెస్ ‌‌ ‌‌ పార్టీతో కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామికి ఎనలేని అనుబంధం ఉందని, ఆయన తనయుడు నేడు కాంగ్రెస్ ‌‌ ‌‌ పార్టీలో చేరడం తిరిగి సొంతింటికి వచ్చినట్టైందన్నారు. రాష్ట్రంలో దొరల పాలనకు చరమగీతం పాడాలని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ‌‌ ‌‌ పార్టీని గెలిపించాలన్నారు. ఈ మీటింగ్ ‌‌ ‌‌లో లీడర్లు బొమ్మక రాజేశ్ ‌‌, దాసరి విజయ్ ‌‌ ‌‌, పంజా శ్రీనివాస్ ‌‌ ‌‌, తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : సేవ చేసే ఛాన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వండి : కడియం శ్రీహరి