ఉద్యోగులకు దీపావళి కానుకలిస్తున్న కంపెనీలు

ఉద్యోగులకు దీపావళి కానుకగా బోనస్​ ఇస్తున్నరు

మళ్లీ పాత శాలరీలు ఆఫర్

న్యూఢిల్లీ: ఉద్యోగుల కళ్లలో దీపావళి కాంతులు విరజిల్లుతున్నాయి. కరోనా కారణంగా వేతన కోత చేపట్టిన కంపెనీలు మళ్లీ తిరిగి అంతకుముందు శాలరీలను ఆఫర్ చేస్తున్నాయి. అంతేకాక కొన్ని కంపెనీలు దీపావళి బోనస్‌‌‌‌‌‌‌‌లు ఇస్తున్నాయి. ఓల్టాస్, విజయ సేల్స్ వంటి కంపెనీలు తమ కంపెనీ ఉద్యోగులకు దీపావళి బోనస్‌‌‌‌‌‌‌‌లను ఇచ్చాయి. అర్బన్ కంపెనీ తన అప్రైజల్ సైకిల్‌‌‌‌‌‌‌‌ను ఆధునీకరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఉద్యోగులకు వేరియబుల్ పే చెల్లించింది. కొటక్ మహీంద్రా బ్యాంక్‌‌‌‌‌‌‌‌ వేతన కోతను వెనక్కి తీసుకుంది. ఏడాదికి రూ.25 లక్షలకు పైన జీతాలను పొందే టాప్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌లకు ఇన్ని రోజులు కొటక్ మహీంద్రా బ్యాంక్ వేతన కోత చేపట్టింది. ఏడాదికి రూ.25 లక్షల కంటే తక్కువ జీతాలను తీసుకునే ఉద్యోగులకు ఎలాంటి వేతన కోతను చేపట్టలేదు. అక్టోబర్ 1 నుంచి అంతకుముందు శాలరీలను ఆఫర్ చేస్తున్నామని ఈ బ్యాంక్ చెప్పింది. ఉదయ్ కొటక్ మాత్రం వాలంటరీగానే  ఈ ఆర్థిక సంవత్సరం కేవలం రూ.1 శాలరీనే తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కొటక్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌తో పాటు  టీవీ బ్రాడ్‌‌‌‌‌‌‌‌కాస్టర్స్ స్టార్, జీ, వయాకామ్18 వంటివి కూడా వేతన కోతలను వెనక్కి తీసుకున్నాయి. జీ తన ఉద్యోగులకు చెల్లించాల్సి ఉన్న 50 శాతం బోనస్ అమౌంట్‌‌‌‌‌‌‌‌ను దీపావళికి ముందే ఎంప్లాయీస్ అకౌంట్లలో క్రెడిట్ చేసింది. చాలా కంపెనీలు సంప్రదాయబద్ధంగా వస్తోన్న ఫెస్టివల్ బోనస్‌‌‌‌‌‌‌‌ చెల్లింపు విధానాన్ని కంటిన్యూ చేస్తున్నాయి. దీపావళి బోనస్‌‌‌‌‌‌‌‌లతో ఉద్యోగులను ఆనందపరుస్తున్నాయి. కరోనా మహమ్మారి హోటల్స్, ట్రావెల్, కొన్ని ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఇండస్ట్రీలు ఇంకా వేతన కోతలను రీస్టోర్ చేయాల్సి ఉంది. ‘కరోనా కాలంలో మా స్టోర్లన్ని మూతపడ్డాయి. అయినా విజయ సేల్స్ ఉద్యోగులకు ఎలాంటి జీతాల కోతను చేపట్టలేదు. ఎలాంటి లేఆఫ్స్ ప్రకటించలేదు. ప్రస్తుతం దీపావళి ఫెస్టివ్ సీజన్ నడుస్తోంది. మా ఉద్యోగులకు బోనస్‌‌‌‌‌‌‌‌లు ఇవ్వడం ప్రారంభించాం. నెల వేతనాన్ని దీపావళి బోనస్‌‌‌‌‌‌‌‌గా ఉద్యోగులందరికీ ఇస్తున్నాం. ముందు నుంచి వస్తోన్న ఈ ట్రెడిషన్‌‌‌‌‌‌‌‌ను మేము కొనసాగించాలనుకుంటున్నాం. ఈ కష్ట సమయంలో కూడా ఉద్యోగులందరూ మాతో కలిసి పయనించారు’ అని విజయ సేల్స్ మేనేజింగ్ పార్టనర్ నిలేష్ గుప్తా తెలిపారు. కన్జూమర్ డిమాండ్ తిరిగి కరోనా ముందటి స్థాయిలకు వచ్చిందని, ఈ దీపావళికి విజయ సేల్స్ 5–7 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌ను నమోదు చేస్తాయని అంచనావేస్తున్నామని పేర్కొన్నారు.

దీపావళికి ముందు అప్రైజల్ సైకిల్..

టాటా గ్రూప్ కంపెనీ ఓల్టాస్ కూడా తన ఉద్యోగులకు దీపావళి బోనస్‌‌‌‌‌‌‌‌లను ఇచ్చింది. ఈ కంపెనీ జూలై లేదా ఆగస్ట్‌‌‌‌‌‌‌‌ నెలలో ఉద్యోగులకు బోనస్‌‌‌‌‌‌‌‌లు ఇస్తోంది. కానీ ఈసారి కరోనాతో కాస్త ఆలస్యమైందని కంపెనీ చెప్పింది. అర్బన్‌‌‌‌‌‌‌‌క్లాప్ కూడా తమ పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మెన్స్ అప్రైజల్ సైకిల్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనేందుకు ఉద్యోగులందరూ అర్హులేనని చెప్పింది. ‘గత ఏడాది  కాలంగా మా ఉద్యోగులు కన్జూమర్లకు ఉన్నతమైన సేవలందించేందుకు విసుగు లేకుండా పనిచేశారు. 2020లో పలు కారణాల చేత మా అప్రైజల్ సైకిల్‌‌‌‌‌‌‌‌ను హోల్డ్‌‌‌‌‌‌‌‌లో పెట్టాం. ఫెస్టివ్ సీజన్‌‌‌‌‌‌‌‌కు ముందు మేము మా అప్రైజల్ సైకిల్‌‌‌‌‌‌‌‌ను తీసుకొస్తున్నాం. ఇది మా ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని తెస్తోంది’ అని అర్బన్‌క్లాప్ డైరెక్టర్ సనా నాయర్ అన్నారు.

For More News..

ప్లే ఆఫ్స్‌ బెర్త్‌‌ దక్కించుకున్న హైదరాబాద్