హైదరాబాద్, వెలుగు: పత్తి బేళ్లు, పత్తి విత్తనాలు, పత్తినూలు తయరుచేసే అక్షిత కాటన్ లిమిటెడ్ 1:3 నిష్పత్తిలో బోనస్ ఇష్యూను ప్రతిపాదించింది. రికార్డు తేదీ నాటికి ప్రతి మూడు పూర్తిగా చెల్లించిన ఈక్విటీ షేర్లకు ఒక బోనస్ ఈక్విటీ షేర్ చొప్పున కేటాయిస్తారు. అయితే దీనికి వాటాదారుల నుంచి అనుమతి రావాల్సి ఉంది. 2024 జూన్ 30తో ముగిసిన మొదటి క్వార్టర్‌కు ఆర్థిక ఫలితాలను కూడా కంపెనీ ప్రకటించింది.
ఈ క్వార్టర్లో కంపెనీ నికర లాభం రూ.3.54 కోట్లుగా ఉండగా, పన్నులకు ముందు లాభం రూ.4.96 కోట్లు వచ్చింది. 2025 ఆర్థిక సంవత్సరంలోని ఈ మొదటి క్వార్టర్‌కు గాను కంపెనీ మొత్తం ఆదాయం రూ.154.96 కోట్లు కాగా, ఇబిటా రూ.5.73 కోట్లు ఉంది.