కామారెడ్డి, వెలుగు: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నరకం ధాన్యాన్ని పండించిన రైతుల ఖాతాల్లో బోనస్జమచేస్తోంది. క్వింటాల్‌కు రూ.500 చెల్లిస్తోంది. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు రైతుల అకౌంట్లలో రూ. 30.20 కోట్లు జమయ్యాయి. జిల్లాలో వానాకాలం సీజన్లో 3 లక్షల ఎకరాల్లో వరి సాగయితే, ఇందులో సన్న రకం 95,423 ఎకరాల్లో సాగయ్యింది. ప్రైవేట్ వ్యాపారులకు కొంతమంది రైతులు ధాన్యాన్ని విక్రయించారు.
గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ సీజన్ నుంచి సన్నాలకు బోనస్ చెల్లిస్తోంది. ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో అమ్మిన రైతులకు కూడా క్వింటాల్‌కు రూ.500 చెల్లిస్తోంది. ధాన్యం కొనుగోలుకు 424 సెంటర్లు ఏర్పాటు చేయగా, ఇందులో సన్న రకం ధాన్యం కోసం 64 సెంటర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు సన్నరకం ధాన్యాన్ని 12,224 మంది రైతుల నుంచి 84,190 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. 8,920 మంది రైతుల అకౌంట్లలో రూ.30.20 కోట్లు చెల్లించారు. కనీస మద్దతు ధరతోపాటు బోనస్ జమయ్యేలా చర్యలు చేపట్టామని జిల్లా అగ్రికల్చర్ఆఫీసర్ తిరుమల ప్రసాద్ తెలిపారు.