![హారర్ థ్రిల్లర్ ‘భూ..‘ ఎక్కిళ్లు వస్తే మంచినీళ్ల కోసం చూడొద్దు](https://static.v6velugu.com/uploads/2023/05/Boo-movie-Directed-by-Vijay-in-Telugu-and-Tamil-languages_wmu6jOQIKs.jpg)
రకుల్‌ప్రీత్ సింగ్, విశ్వక్‌సేన్, నివేదా పేతురాజ్, మేఘా ఆకాశ్, రెబ్బాజాన్, మంజిమా మోహన్ లాంటి స్టార్ నటులు అందరూ కలిసి నటించిన హారర్ థ్రిల్లర్ ‘భూ’. తెలుగు, తమిళ భాషల్లో దర్శకుడు విజయ్ తెరకెక్కించారు. జవ్వాజి రామాంజనేయులు, యం.రాజశేఖర్ రెడ్డి నిర్మించారు.
సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా ఉంటుందన్న ఈ సినిమా అందర్నీ మెస్మరైజ్ చేస్తుందన్నారు దర్శక నిర్మాతలు. జియో సినిమా ఓటీటీ ప్లాట్‌ఫాంలో మే 27నుంచి స్ట్రీమింగ్ కానుందని చెబుతూ.. టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘మీకు ఎక్కిళ్లు వస్తే మంచినీళ్ల కోసం చూడకండి. ఒకసారి చుట్టూ చూడండి. మీ పక్కనే దెయ్యం ఉండే అవకాశం ఉంది’ అని జియో స్టూడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. సినిమా కాన్సెప్ట్‌ను తెలియ జేసింది.