ఖైరతాబాద్, వెలుగు: హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌ను ఎన్టీఆర్ స్టేడియంలో ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు నిర్వహించనున్నట్లు బుక్‌ఫెయిర్ ప్రెసిడెంట్ జాలూరు గౌరీశంకర్, కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. శనివారంసోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వారు మీడియాతో మాట్లాడారు. 36వ జాతీయ పుస్తక ప్రదర్శనను ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జ్ఞాన తెలంగాణలో భాగంగా బుక్ ఫెయిర్ నిర్వహించే ప్రాంగణానికి ప్రజాగాయకుడు దివంగత గద్దర్ పేరు పెట్టగా.. వేదికకు రవ్వా శ్రీహరిగా నామకరణం చేశామన్నారు.
శని, ఆదివారాలు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 వరకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8.30 వరకు ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ ప్రదర్శనలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, కోశాధికారి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.