ఇండియన్​కు ‘బుకర్​’ జస్ట్​ మిస్

కొద్దిలో ప్రైజ్​ కోల్పోయిన అవనీ దోషీ

లండన్: మన దేశ రైటర్​కు ప్రతిష్టాత్మక బుకర్​ ప్రైజ్​ కొద్దిలో మిస్​ అయింది. న్యూయార్క్​కు చెందిన రైటర్​ డగ్లస్​ స్టువర్ట్​కు ఈ ఏడాది ఆ ప్రైజ్​ దక్కింది. ఆయన రాసిన ‘షగ్గీ బెయిన్​’ అనే నవలకుగానూ ఈ అవార్డు వచ్చింది. ఫైనల్స్​కు షార్ట్​లిస్ట్​ అయిన అవనీ దోషీ ‘బర్న్ట్​ షుగర్​’ నవలకు అవకాశం దక్కకుండా పోయింది. అవార్డు గెలుచుకున్న స్టువర్ట్​కు సుమారు రూ.50 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నారు. వయసు, ప్రేమ, తాగుడు ఆధారంగా ఆయన ఈ నవలను రాశారు. తాను 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన తల్లి తాగుడు కారణంగా చనిపోయిందని, ఆమెకే ఈ నవలను అంకితం చేస్తున్నానని స్టువర్ట్​ చెప్పారు. బుక్కులోని అంశాలన్నీ కల్పితాలే అయినా.. నిజ జీవితంలో జరిగిన ఘటనలను ఆధారంగా చేసుకుని రాశానని అన్నారు.

For More News..

ఒక్కరోజులోనే టికెట్లు ఖతం

బకాయిలు కట్టకపోతే కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తం… కేసులు పెడుతం

జీహెచ్ఎంసీలో ప్రచారం కోసం లీడర్ల చలో హైదరబాద్​