
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన స్టాండ్-అప్ కమెడియన్ కునాల్ కామ్రాకు ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో షాక్ ఇచ్చింది. తమ ఫ్లాట్‌ఫామ్ నుంచి కునాల్ కామ్రాకు సంబంధించిన కంటెంట్ మొత్తం తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా తమ వైబ్ సైట్ కళాకారుల జాబితా నుంచి కునాల్ క్రామాను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. కామ్రా వ్యాఖ్యలు సమాజాన్ని విభజించేలా ఉన్నాయని.. అందుకే అతడి కంటెంట్‌ను తమ ఫ్లాట్‌ఫామ్ నుంచి మొత్తం రిమూవ్ చేస్తోన్నట్లు బుక్ మై షో క్లారిటీ ఇచ్చింది.
కాగా.. ఏక్‌నాథ్ షిండేపై కామ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత శివసేన (షిండే వర్గం) లీడర్ రాహూల్ ఎన్ కనాల్ బుక్‌మైషోకు ఒక రిక్వెస్ట్ చేశాడు. సమాజంలో వివాదాలు సృష్టించేలా మాట్లాడుతోన్న కమెడియన్ కునాల్ కామ్రా కంటెంట్‌ను బుక్ మై షో ఫ్లాట్ ఫామ్ నుంచి తొలగించడంతో పాటు.. అతడి ప్రొఫైల్‌ను వైబ్‌సైట్ నుంచి రిమూవ్ చేయాలని విజ్ఞప్తి చేశాడు. అలాగే.. కామ్రా రాబోయే షో టిక్కెట్ల అమ్మకాలను కూడా ఆపేయాలని కోరాడు.
కునాల్ ప్రదర్శనలకు వేదికను అందించడం ద్వారా బుక్‌మైషో విశ్వసనీయతను కోల్పోవడంతో పాటు సమాజంలో అల్లర్లు సృష్టించాలనుకునే వ్యక్తికి మద్దతు తెలిపినట్లు అవుతోందని.. దీనిని దృష్టిలో పెట్టుకుని కునాల్ కామ్రాపై చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశాడు. శివసేన (షిండే వర్గం) లీడర్ రాహూల్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న బుక్ మై షో వెంటనే తమ ఫ్లాట్‌ఫామ్ నుంచి కునాల్ కామ్రా కంటెంట్ అంతా తొలగించింది.
►ALSO READ | AA22 Update: బన్నీ కోసం హాలీవుడ్ బ్యూటీ.. ఇంతకీ ఆ హీరోయిన్ ఒప్పుకుంటుందా..?
అలాగే.. తమ సైట్‌లోని ఆర్టి్స్టుల జాబితా నుంచి కూడా కునాల్ ప్రొఫెల్ రిమూవ్ చేయడంతో పాటు కునాల్ షోలకు సంబంధించిన టికెట్ల బుకింగ్, అమ్మకాలను నిలిపేసింది. తన విజ్ఞప్తి మేరకు కునాల్ కామ్రా కంటెంట్, ప్రొఫైల్ రిమూవ్ చేసిన బుక్ మై షో నిర్ణయాన్ని రాహూల్ స్వాగతించారు. ఈ సందర్భంగా బుక్‌మైషోకు ధన్యవాదాలు తెలిపారు.
వివాదం ఏంటంటే..?
2025, మార్చి 23 రాత్రి ముంబైలోని యూని కాంటినెంటల్ హోటల్లో నిర్వహించిన స్టాండప్ కామెడీ షోలో డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండేపై కమెడియన్ కునాల్ కామ్రా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఏక్ నాథ్ షిండేను గద్దార్ (దేశ ద్రోహి) అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అంతే కాకుండా దిల్ తో పాగల్ హై సినిమా పాటను పేరడీ చేస్తూ షిండేపై సెటైర్లు వేశారు.
కునాల్ వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలు భగ్గుమన్నారు. కునాల్ స్టాండప్ కామెడీ నిర్వహించిన హోటల్‌ను ధ్వంసం చేయడంతో పాటు వెంటనే కునాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శివసేన ఎమ్మెల్యే మురాజీ పటేల్ కునాల్ కామ్రాపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిప్యూటీ సీఎం షిండేపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని.. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఎమ్మెల్యే మురాజీ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు కునాల్‌పై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు అవ్వాలని నోటీసులు జారీ చేశారు.