మునుగోడులో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కర్నె ప్రభాకర్ అన్నారు. ఉదయం క్యాంప్ ఆఫీస్ లో మునుగోడు ముఖ్య నేతలు సీఎం కేసీఆర్ ను కలిశారు. బై పోల్లో టిక్కెట్ కోసం బూర నర్సయ్యగౌడ్, కర్నె ప్రభాకర్ తీవ్రంగా యత్నించారు. టిక్కెట్ ను ఆశించడంలో తప్పు లేదని.. అయితే తన అవసరం జాతీయ రాజకీయాల్లో ఎక్కువగా ఉందని కేసీఆర్ చెప్పినట్టు బూర నర్సయ్యగౌడ్ వివరించారు.
అధినేత ఆదేశాలను పాటిస్తామని బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. మరోవైపు మునుగోడు టీఆర్ఎస్ లో అంసతృప్తి లేదని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. తాను అందరిలాగే టికెట్ ఆశించానని ఆయన చెప్పారు. అధినేత నిర్ణయం అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని కర్నె ప్రభాకర్ వెల్లడించారు.