రాష్ట్రంలో ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంటుంది : బూర నర్సయ్య గౌడ్

యాదాద్రిభువనగిరి జిల్లా : రాష్ట్రంలో ప్రతి స్కీమ్ వెనుక ఒక  స్కామ్  ఉంటుందని భువనగిరి మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు.  భువనగిరి ఎంపీగా తాను చేసిన అభివృద్ధి..  కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సహకారం వల్లనేనన్నారు.  అభివృద్ధి విషయంలో బీజేపీకి భేదాలు లేవన్న ఆయన అందరిని సమానంగా చూస్తారని తెలిపారు.

 యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రాలేదంటే అది రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్లనేనని చెప్పారు. తాను టీఆర్ఎస్  నుంచి బయటకు వచ్చింది తన భవిష్యత్తు కోసం కాదని... రాష్ట్ర భవిష్యత్తు గురించి చెప్పారు. రాష్ట్రంలో గడీల నియంతృత్వ పాలన విముక్తి కోసం పనిచేస్తానని, బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తమ ముందున్న  ప్రధాన లక్ష్యమని బూర  స్పష్టం చేశారు.