హైదరాబాద్, వెలుగు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అంశం అందరూ ఊహించిందేనని, కొత్త న్యూస్ ఏం కాదని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఆయన శరీరం మాత్రమే బీజేపీలో ఉందని, ఆత్మ కాంగ్రెస్‌లోనే ఉందని ఆరోపించారు. బుధవారం అలయ్ బలయ్ కార్యక్రమంలో బూర నర్సయ్య మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నమ్మే స్థితిలో పబ్లిక్ లేరని, కేసీఆర్‌ని ప్రగతి భవన్ నుంచి ఖాళీ చేయించే పనిలో రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనేనన్నారు. హైకమాండ్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని, భువనగిరి నుంచి ఎంపీ గా పోటీ చేయాలని ఆసక్తి ఉందన్నారు.
బీజేపీలోనే కొనసాగుతా: మర్రి శశిధర్ రెడ్డి
గాలికి వచ్చి వెళ్లే వ్యక్తిని కాదని, బీజేపీలోనే కొనసాగుతానని మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని అంశాలు ఆలోచించే పార్టీ మారానని, బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. బుధవారం అలయ్ బలయ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ను ఎదుర్కోవడం బీజేపీతోనే సాధ్యమని అన్నారు.
ALS0 READ: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన 12మంది మృతి