మహిళ ప్రాణాలు కాపాడిన బూర నర్సయ్య గౌడ్

మహిళ ప్రాణాలు కాపాడిన బూర నర్సయ్య గౌడ్

భువనగిరి మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం పట్టణంలో నాగార్జున సాగర్ హైవేపై ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి కిందపడి ఓ మహిళ సృహ కోల్పోయింది. ఆ సమయంలో అదే మార్గంలో వెళ్తున్న బూర... ఆమెకు ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలను కాపాడి వృత్తిధర్మాన్ని పాటించిన బూరకు అక్కడి స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లోకి రాకముందు బూర నర్సయ్య గౌడ్ వైద్య  వృత్తిలో కొనసాగారు. పలు హాస్పిటల్ లలో డాక్టర్ గా సేవలు అందించారు.