వచ్చే ఎన్నికల్లో భువనగిరిలో బీజేపీ గెలవకపోతే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేస్తానన్నారు భూర నర్సయ్య గౌడ్. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, లింగోజి గూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు భూర నర్సయ్య . బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటే అన్న వారిని చెప్పుతో కొడతామని కామెంట్ చేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి ఇద్దరు భువనగిరి పార్లమెంట్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. దమ్ము ధైర్యం ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు గతంలో లేదు భవిష్యత్తులో కూడా ఉండబోదన్నారు. కాళేశ్వరంపై హంగామా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దమ్ముంటే బీఆర్ఎస్ నాయకుల పై కేసులు నమోదు చేయాలని సవాల్ చేశారు.