బీఆర్ఎస్ నేతలు పేదల భూములు లాక్కుంటున్నరు

మంచాల, వెలుగు:  పదిహేనేళ్ల కిందట సత్యం కంపెనీ అధినేత రామలింగరాజు, ఆకుల రాజయ్య మరికొందరు మంచాలలో భూములను తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ.. డబ్బులివ్వకుండానే ఏజీపీఏ, జీపీఏ చేయించుకున్నారని మాజీ ఎంపీ బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. ఆ భూములను బ్యాంకుల్లో పెట్టి వేల కోట్ల రుణాలు తీసుకున్నారన్నారు. కాగా.. ఆ భూములు ఇప్పటివరకు రైతుల ఆధీనంలో ఉండగా..  ఇటీవల సత్యం కంపెనీ నుంచి తాము కొనుగోలు చేసినట్లు కొంతమంది భూములను లాక్కోవాలని చూస్తున్నారని ఆరోపించారు. 

శుక్రవారం మంచాల మండలం లోయపల్లి  గ్రామ రెవెన్యూపరిధిలోని భూములను బూర నర్సయ్య గౌడ్ తో పాలు పలువురు నేతలు పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు.  భూములు లాక్కున్న వారికి బీఆర్ఎస్ నేతలు అండగా ఉంటే.. కోల్పోతున్న పేద రైతులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు.  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోగిరెడ్డి లచ్చిరెడ్డి, వనపర్తి జిల్లా ఇన్ చార్జి బోసుపల్లి ప్రతాప్, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ కన్వీనర్ యాదగిరి రెడ్డి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పోరెడ్డి అర్జున్ రెడ్డి, నేతలు గోవర్ధన్ చారి, వెంకట్ రెడ్డి, నిట్టు శ్రీశైలం ఉన్నారు.