ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌/మఠంపల్లి, వెలుగు : డబుల్‌‌‌‌‌‌‌‌ ఇంజిన్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మాజీ ఎంపీ, బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ బూర నర్సయ్యగౌడ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన సీఎం ఇప్పుడు దేశాన్ని ఆ ఊబిలోకి దింపేందుకు ఢిల్లీకి పోతున్నారని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాలు, కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గంలోని 18 లిఫ్ట్‌‌‌‌‌‌‌‌లను నడపలేని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ దేశంలో 70 వేల టీఎంసీలను లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ చేసి నీటి సమస్యను పరిష్కరిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. లిక్కర్‌‌‌‌‌‌‌‌ ద్వారా వచ్చే ఇన్‌‌‌‌‌‌‌‌కంతోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందన్నారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ గెలిస్తే కల్వకుంట్ల కుటుంబీకులే సీఎం అవుతారని, అదే బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎవరైనా సీఎం కావొచ్చని చెప్పారు. రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను నమ్మడం లేదని, అందుకే దేశం మీద పడ్డారని ఎద్దేవా చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యారెడ్డి, జిల్లా జనరల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ అక్కిరాజు యశ్వంత్ , మల్సూర్‌‌‌‌‌‌‌‌ గౌడ్, కోటిరెడ్డి, ఇంటి రవి, అంబళ్ల నరేశ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. అనంతరం మఠంపల్లిలో నిర్మించనున్న కంఠమహేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపనకు బూర నర్సయ్యగౌడ్‌‌‌‌‌‌‌‌ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


సమస్యలను నెల రోజుల్లో పరిష్కరించాలి

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట పట్టణంలో నెలకొన్న సమస్యలను నెల రోజుల్లో పరిష్కరించాలని, లేకపోతే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతామని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి హెచ్చరించారు. సూర్యాపేట మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ ఎదుట సోమవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. పింఛన్లు రాక, రేషన్‌‌‌‌‌‌‌‌ కార్డులు లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్‌‌‌‌‌‌‌‌ ఇండ్ల కోసం 15 వేల మంది అప్లై చేసుకుంటే 191 మందికి మాత్రమే పంపిణీ చేయడం సరికాదన్నారు. డబుల్‌‌‌‌‌‌‌‌ ఇండ్ల పేరుతో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సూర్యాపేటలో ల్యాండ్, సాండ్‌‌‌‌‌‌‌‌ మాఫియా పెరిగిపోయిందన్నారు. రైతులకు రుణమాఫీ, దళితులకు మూడు ఎకరాల భూమి హామీ ఏమైందని ప్రశ్నించారు. మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డికి దమ్ముంటే వార్డుల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకొని, పరిష్కరించేందుకు కృషి చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. అనంతరం పట్టణంలోని కృష్ణ కాలనీ నుంచి మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ వరకు ర్యాలీ నిర్వహించారు. జీకేడీ ప్రసాద్‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం 
అందజేశారు.

బలహీనవర్గాలకు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో పెద్దపీట

మిర్యాలగూడ, వెలుగు : బడుగు, బలహీనవర్గాల  వారికి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో పెద్ద పీట వేస్తున్నామని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి చెప్పారు. నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా నియామకం అయిన కేతావత్‌‌‌‌‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌ను సోమవారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో మిర్యాలగూడలో సన్మానించారు. ఈ కార్యక్రమానికి జానారెడ్డి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ పటిష్టానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గ అధ్యక్షుడు అలుగుబెల్లి అమరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, బ్లాక్‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్, దామరచర్ల మండల అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్, దుండిగాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

ప్రమాద బాధితులను పరామర్శించిన జానారెడ్డి

హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గంలో పలు మండలాలకు చెందిన ఇటీవల ప్రమాదాలు, అనారోగ్యానికి గురైన పలువురిని సోమవారం జానారెడ్డి పరామర్శించారు. పులిమామిడి మాజీ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ మాలె సత్యనారాయణరెడ్డి, గుర్రంపోడు మండలం ఎలమోనిగూడెం సర్పంచ్ కూర వెంకటయ్య, హాలియా మాజీ సర్పంచ్ స్వామినాయక్‌‌‌‌‌‌‌‌ను పరామర్శించారు. బ్లాక్‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, వైస్‌‌‌‌‌‌‌‌ ఎంపీపీ మాలె అరుణ ఉన్నారు.

మంత్రి అండతోనే బీజేపీ లీడర్లపై దాడులు

పెన్‌‌‌‌‌‌‌‌పహాడ్‌‌‌‌‌‌‌‌, వెలుగు : టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి అండతోనే బీజేపీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు ఆరోపించారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్ల దాడిలో గాయపడ్డ సూర్యాపేట జిల్లా పెన్‌‌‌‌‌‌‌‌పహాడ్‌‌‌‌‌‌‌‌ మండలం అన్నారానికి చెందిన బీజేపీ మండల అధ్యక్షుడు పోకల రాములును సోమవారం ఆయన పరామర్శించారు. అనంతరం సంకినేని మాట్లాడుతూ టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు చెందిన రాచూరి రమణ, ఆమె భర్త రాచూరి ప్రతాప్‌‌‌‌‌‌‌‌ 50 మందితో కలిసి శనివారం రాత్రి రాములుపై దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ నమోదు చేయకపోవడం సరికాదన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోకల రాములు, అసెంబ్లీ కన్వీనర్‌‌‌‌‌‌‌‌ కర్నాటి కిషన్‌‌‌‌‌‌‌‌, జిల్లా ఉపాధ్యక్షుడు పోకల వెంకటేశ్వర్లు, చల్లమల్ల నరసింహ,  నాయకులు తుక్కాని మన్మథరెడ్డి, సైదులు, గార్లపాటి మమతారెడ్డి పాల్గొన్నారు.

రోడ్ల అభివృద్ధికి రూ. 105 కోట్లు మంజూరు

దేవరకొండ, వెలుగు : నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా మార్చడంతో పాటు రిపేర్లకు రూ. 105.12 కోట్లు మంజూరు అయినట్లు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. గిరిజన తండాల్లోని మట్టి రోడ్లను బీటీగా మార్చేందుకు 30.53 కోట్లు, పీఆర్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని బీటీ రోడ్ల రిపేర్లకు 41.59 కోట్లు, ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌బీ రోడ్ల రిపేర్లకు రూ.33 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఈ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. సమావేశంలో మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఆలంపల్లి నర్సింహ, వైస్‌‌‌‌‌‌‌‌ ఎంపీపీ చింతపల్లి సుభాశ్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, ముత్యాల సర్వయ్య, శిరందాసు కృష్ణయ్య పాల్గొన్నారు.


రైతుబంధు సమితి:నల్గొండ అధ్యక్షుడిగా శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి

మిర్యాలగూడ, వెలుగు :  రైతుబంధు సమితి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ చింతరెడ్డి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో విద్యుత్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌, మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌‌‌‌‌‌‌‌ గుత్తా సుఖేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌‌‌‌‌‌‌‌రావుకు థాంక్స్‌‌‌‌‌‌‌‌ చెప్పారు.

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

మునుగోడు/చండూరు, వెలుగు : నల్గొండ జిల్లా చండూరు, మునుగోడు మండలంలోని పలు గ్రామాలకు చెందిన వారికి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను సోమవారం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పంపిణీ చేశారు. అంతకుముందు మునుగోడులోని పలు  వార్డుల్లో పర్యటించి మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే చండూరు మున్సిపాలిటీలోని పదో వార్డులో రేషన్‌‌‌‌‌‌‌‌ షాపును ప్రారంభించారు. మునుగోడులో ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్ , తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ కృష్ణారెడ్డి, ఎంపీడీవో జానయ్య, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మండల అధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, చండూరులో మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ తోకల చంద్రకళ వెంకన్న, ఎంపీపీ పల్లె కల్యాణి, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ గణేశ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.