Super Food : ఈ ఫుడ్ తింటే.. రాళ్లు అయినా ఇట్టే అరిగిపోతాయి.. మలబద్దకం అనేది రాదు..!

Super Food : ఈ ఫుడ్ తింటే.. రాళ్లు అయినా ఇట్టే అరిగిపోతాయి.. మలబద్దకం అనేది రాదు..!

హైటెక్​ యుగంలో  జనాలు  పొద్దున్న లేచిన దగ్గర నుంచి బిజీ బిజీగా గడుపుతున్నారు.  సమయానికి తిండి కూడా తినడం లేదు. ఆకలైనప్పుడు అక్కడ అందుబాటులో ఉండే  వాటిని పొట్టలో పడేస్తూ జీవితాన్ని వెళ్లదీస్తున్నాము.  తినే వాటిలో  పోషకాలు ఉన్నాయా లేదా అన్నది మాత్రం ఆలోచించడం లేదు.  దీని జీర్ణక్రియ దెబ్బతిని పలు రకాల వ్యాధులకు దారి తీస్తుంది. కాని అలా కాకుండా కొన్ని రకాల సూపర్ ఫుడ్స్​ ను ఆహారంలో చేర్చుకోవడం వలన జీర్ణక్రియకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ఇప్పుడు అలాంటి సూపర్​ ఫుడ్స్​ గురించి తెలుసుకుందాం. . . 

కంప్యూటర్​ యుగంలో జనాలు ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు.  నాలుకకు కొద్దిగా రుచి అనిపించిందా అంటే చాలు.. ఖాళీ సమయాల్లో వాటిని పొట్టలో పడేసే పనిమీద ఉంటారు.  ఇక అంతే వారికి తిన్నది జీర్ణం కాక వారు పడే ఇబ్బంది అంతా  ఇంతా కాదు.. అజీర్ణం.. మలబద్దకం.. కడుపునొప్పి .. ఇలా అనేక సంబంధమైన వ్యాధులతో బాధపడుతుంటారు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే.. జీర్ణవ్యవస్థ బాగుండాలంటే ఎలాంటి ఫుడ్​తీసుకోవాలో తెలుసుకుందాం. . .

అరటిపండ్లు: అరటిపండ్లలో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది, ఇది కార్బోహైడ్రేట్లు జీర్ణమయ్యే వేగాన్ని నియంత్రించడంలో పాత్ర పోషిస్తుంది. అరటిపండ్లు ప్రేగులకు కూడా మంచివి.  ప్రేగులలో ఉండే   ప్రోబయోటిక్స్ అనే  బ్యాక్టీరియాను పోషించే లక్షణం అరటిపండుకు ఉంటుంది.ఇంకా అరటిపండులో  కార్బోహైడ్రేట్లు ..  ప్రీబయోటిక్స్ ఉంటాయి.

ఓట్స్: ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది.  వీటిలో  కేలరీలు తక్కువగా ఉంటాయి.  భాస్వరం, విటమిన్ ఇ , జింక్  వంటి మూలకాలు ఓట్స్​ లో ఉంటాయి. ఇవి  జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి .. శరీరంలో  వ్యర్థాలను తొలగించడానికి  సహాయపడతాయి.

పెరుగు: కడుపు నొప్పికి అత్యంత ప్రాచుర్యం పొందిన ఇంటి నివారణలలో పెరుగు అన్నం ఒకటి. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. పెరుగులో ఉండే  గట్ బాక్టీరియా  ఆరోగ్య సమతుల్యతను పునరుద్ధరించడానికి, జీర్ణక్రియను సులభతరం చేయడానికి సహాయపడుతుంది.

అల్లం: ఉబ్బరం, వికారం , విరేచనాలు వంటి అనేక కడుపు ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి అల్లం ఉపయోగపడుతుంది. అల్లం కడుపు నుండి ప్రేగులకు ఆహారం కదలికను వేగవంతం చేయడానికి  సహాయపడుతుంది.

పుదీనా: పుదీనా అజీర్ణ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. పుదీనాను సలాడ్లు ..  పండ్లలో సువాసన కలిగించే పదార్థంగా తీసుకోవచ్చు.

నీరు: ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు నీరు చాలా అవసరం.  ఇది జీర్ణవ్యవస్థ ప్రేగుల నుండి ఆహారాన్ని సజావుగా తరలించడానికి సహాయపడుతుంది. తగినంత నీరు లేకపోవడం మలబద్ధకం లాంటి  సమస్యలు వస్తాయి. రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు త్రాగితే ఎలాంటి సమస్యలు ఉండవు. 

ALSO READ | Astrology: వృషభ రాశిలో.. చంద్రుడు.. గురుడు కలయిక.. మూడు రాశుల వారికి గజకేసరి యోగం