కరోనా కేసులు మరోసారి పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా నేటి నుంచి ప్రికాషన్ డోసు ఇస్తున్నారు. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏండ్లపైబడిన వారికి బూస్టర్ డోసు వేస్తున్నారు. అందులో భాగంగా కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై బెంగళూరులోని శ్రీ అటల్ బిహరీ వాజ్‌పేయ్ మెడికల్ కాలేజీలో ప్రికాషన్ డోస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Karnataka CM Basavaraj Bommai launches rollout of 'Precaution dose' vaccination for healthcare workers, frontline workers and persons aged above 60 with co-morbidities at Sri Atal Bihari Vajpayee Medical College in Bengaluru pic.twitter.com/SCmHvuW29I
— ANI (@ANI) January 10, 2022
అదేవిధంగా తమిళనాడు సీఎం స్టాలిన్ చెన్నైలో బూస్టర్ డోస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా ఫ్రంట్ లైన్ వర్కర్లైన పోలీసులకు, సీనియర్ సిటిజన్లకు ప్రికాషన్ డోస్ ఇచ్చారు.
Chennai | Tamil Nadu begins administering COVID19 vaccine 'Precaution dose' to frontline workers and senior citizens above 60 years of age with co-morbidities pic.twitter.com/SwoHeRjpiB
— ANI (@ANI) January 10, 2022
త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న సిబ్బందిని ఫ్రంట్ లైన్ వర్కర్లుగానే పరిగణించనున్నారు. వీరిలో బూస్టర్ డోసుకు అర్హులైనవారికి ఇప్పటికే ఎస్ఎంఎస్లు పంపినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్ సుఖ్ మాండవీయ తెలిపారు. రెండో డోసు తీసుకున్న వారు 9 నుంచి 12 నెలల గ్యాప్‌లో బూస్టర్ డోసు తీసుకోవాలని ఆయన సూచించారు.
దేశంలో కోటి ఐదు లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు, ఒక కోటి 9 లక్షల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు, 2 కోట్ల 75 లక్షల మంది 60 ఏండ్ల పైబడినవారు ప్రికాషన్ డోసు వేసుకోనున్నారు. గతంలో తీసుకున్న వ్యాక్సిన్నే బూస్టర్ డోసు కింద ఇవ్వనున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. కోవాగ్జిన్ తీసుకున్న వారికి కోవాగ్జిన్.. కోవిషీల్డ్ తీసుకున్న వారికి కోవిషీల్డ్ ఇవ్వనున్నారు. కోవిడ్-19 ప్రికాషన్ డోసు పొందాలనుకుంటున్న లబ్ధిదారులు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న, అర్హులైన వారు నేరుగా అపాయింట్మెంట్ తీసుకోవటం లేదా నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి టీకా తీసుకోవచ్చని తెలిపింది.
For More News..